![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-438లో.. ధీరజ్ తో ప్రేమ మట్లాడుతుంది. అరెయ్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ రా.. అమూల్య విషయంలో నాకేం పాపం తెలియదురా.. ఇది నా కుటుంబం.. నా కుటుంబానికి నేను ప్రాణం పోయినా ద్రోహం చేయనురా అని ధీరజ్ ప్రేమ అంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదురా.. నా మనసులో నిజంగానే స్వచ్చమైన ప్రేమ ఉంది రా అని ప్రేమ అనగానే ఆపుతావా నీ నాటకాలు అని ధీరజ్ అంటాడు. నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను పాత ధీరజ్ ని కాదు.. నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మోసం కాదురా నిజం.. నా మీద నీకు ప్రేమ కలగడానికి ముందే నేను నిన్ను ప్రేమించాను కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదురా.. నువ్వు ప్రపోజ్ చేసాక. నాలో ఉన్న ప్రేమని నీకు చెప్పకుండా దాచడం నా వల్ల కాలేదు.. అప్పుడే ఈ గొడవ జరిగింది.. అందుకే ఇప్పుడు చెప్తున్నా..ఐ లవ్ యూ రా ధీరజ్ అని చెప్తూ లవ్ బర్డ్స్ ని ఇస్తుంది. కానీ ధీరజ్ ఆ బొమ్మని విసిరేస్తాడు. అది విరిగిపోతుంది.
ఇక ప్రేమ ఆ పగిలిన బొమ్మని తీస్తుంటే తన చేతికి గాయమై రక్తం కారుతుంది. అప్పుడే అటుగా నర్మద వస్తుంది. ప్రేమకి గాయం తగిలింది చూసి, వచ్చే రక్తం చూసి.. ఏంటి ధీరజ్ ఇలా చేస్తున్నావని నర్మద నిలదీస్తుంది. దాంతో ధీరజ్ అక్కడినుండి వెళ్ళిపోతాడు. ప్రేమని నర్మద ఓదారుస్తుంది. మరోవైపు శ్రీవల్లి జరిగినది తలుచుకొని బాధపడుతుంది. అదే సమయంలో ఆనందరావు కోసం మిర్చీ బజ్జీలు చేస్తుంది భాగ్యం. ఇక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. అది చూసి శ్రీవల్లి ఓర్వలేకపోతుంది. ఇక ఒక చీపురుకట్ట తీసుకొచ్చి ఇద్దరిని చెడామడా బాదుతుంది. ఎందుకు కొడుతున్నావని భాగ్యం అడుగుతుంది. నా కాపురం కూల్చేసి ఇక్కడ మీరు సరసాలు ఆడుతున్నారా అని ఫైర్ అవుతుంది శ్రీవల్లి. నిన్ను పదిరోజుల్లో ఆ ఇంట్లోకి పంపిస్తానని చెప్పాను కదా.. సరే రేపే నిన్ను మీ అత్త వారింట్లో దింపొస్తానని శ్రీవల్లికి భాగ్యం మాటిస్తుంది. దాంతో తను కూల్ అవుతుంది.
ఇక రాత్రివేళ చందు బాగా తాగేసి బండి తోసుకుంటూ వస్తాడు. మా నాన్నని మోసం చేశావే.. ఈరోజు నీ గురించి చెప్పేస్తానని చందు అనుకుంటాడు. ఇక చందు ఇంటికి రాగానే ధీరజ్, తిరుపతి, సాగర్, నర్మద, ప్రేమ, అమూల్య అందరు వస్తారు. ఇక నాన్న.. నాన్న అంటూ రామరాజుని పిలుస్తాడు చందు. కాసేపటికి రామరాజు బయటకి వస్తాడు. ఏమైందిరా అని రామరాజు అడుగగా నేనే లైట్ గా తాగేసి బైక్ పడేసానని తిరుపతి అబద్ధం చెప్తాడు. నాన్న బండి నేనే పడేసానని చందు అంటాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు. వల్లి గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని చందు అంటాడు. ఏంట్రా తాగేసి వచ్చావా అని రామరాజు అడుగుతాడు. మరోవైపు నర్మద, ప్రేమ అసలు విషయం కవర్ చేయడానికి పదండి బావ.. తినేసి పడుకోండి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామని అంటారు. లేదు నేను తాగి రావడానికి కారణం వల్లీనే అని చందు అంటాడు. అదేంట్రా అని రామరాజు అంటాడు. అసలు నిజమేంటంటే అని చందు చెప్పబోతుంటే.. అదేం లేదు మామయ్య.. వల్లీ అక్క ఇంటికెళ్ళాక ఫోన్ చేయలేదంట అని నర్మద చెప్తుంది. ఇక ధీరజ్ , తిరుపతి ఇద్దరు కవర్ చేసి చందుని లోపలికి తీసుకెళ్తుంటే సూపర్.. సూపర్ అంటు ఇక్కడ ఒక పెద్ద సెంటిమెంట్ డ్రామా జరుగుతుందని సాగర్ క్లాప్స్ కొడతాడు. అది విని.. ఏంటి సాగర్ అని నర్మద అడుగుతుంది. పెద్దకొడుకు తాగేసి వచ్చాడు కాబట్టి ఏం అనడం లేదు.. అదే పని నేను చేస్తే ఏదో దేశద్రోహం చేసినవాడిని చూసినట్టుగా చూసి నా చెంపచెల్లుమనిపిస్తాడు ఈయన అని రామరాజుతో సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |